రాములమ్మకు కీలక బాధ్యతలు

అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్‌ స్టార్ కాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ మహిళా కాంగ్రెస్‌ నేత విజయశాంతికి ఈసారి మరింత కీలక బాధ్యతలు అప్పజెప్పారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రానున్న లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన 5 కమిటీలలో కాంగ్రెస్‌ ప్రచారకమిటీకి విజయశాంతిని చైర్ పర్సన్ గా నియమించారు. 

ఎన్నికల ప్రచార కమిటీ: విజయశాంతి (చైర్ పర్సన్). దీనిలో డికె.అరుణ (కో-చైర్‌పర్సన్‌), తూర్పు జగ్గారెడ్డి, మానవతా రాయ్, రామ్మోహన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఆత్రం సక్కు ఆసిఫా, అనిల్‌ యాదవ్, ఎన్‌.శారద, ఎస్‌.కె.అబ్దుల్లా సొహైల్, బెల్లయ్య నాయక్, వెంకటేశ్, కిరణ్‌ రెడ్డి, విజయ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, హెచ్‌.వేణుగోపాల్, దీపక్‌ జాన్, అమర్, టి.నాగయ్య సభ్యులుగా ఉంటారు. 

ఎన్నికల కమిటీ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జె.గీతారెడ్డి, డికె అరుణ, జైపాల్‌రెడ్డి, జెట్టి కుసుమ్‌కుమార్, మహ్మద్‌ అజారుద్దీన్, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రవీందర్‌నాయక్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డి.సుధీర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.  

పబ్లిసిటీ కమిటీ: ఛైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దీనిలో ఎస్‌.గంగారాం(కో చైర్మన్‌), మల్లు రవి, సురేంద్రరెడ్డి (కన్వీనర్లు), సబితా ఇంద్రారెడ్డి, సీతక్క, చిరుమర్తి లింగయ్య, భిక్షపతి యాదవ్, వనమా వెంకటేశ్వరరావు, సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, హరిప్రియా నాయక్, పోడెం వీరయ్య, కె.హర్షవర్ధన్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ సభ్యులుగా ఉంటారు.  

మీడియా సమన్వయ కమిటీ: ఛైర్మన్ మధుయాష్కి గౌడ్. దీనిలో దాసోజు శ్రవణ్‌కుమార్‌(కన్వీనర్‌), మల్లు రవి, సురేశ్‌ కుమార్, ఇందిరా శోభన్‌ సభ్యులుగా ఉంటారు. 

కోఆర్డినేషన్ కమిటీ: ఛైర్మన్: ఆర్.సి. కుంతియా దీనిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కన్వీనర్‌), భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎండీ అజారుద్దీన్, మల్లు రవి, సీతక్క, రేణుకా చౌదరి, డికె.అరుణ, రేవంత్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, జైపాల్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, ఎం.రంగారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, జగ్గారెడ్డి, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్, జెట్టి కుసుమ్‌కుమార్,బలరాంనాయక్, డి.శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, రాపోలు ఆనంద్‌ భాస్కర్, రేగా కాంతారావు, కె.గౌరీశంకర్, డాక్ట ర్‌ వినయ్‌కుమార్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శులు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు.  

ఐదు కమిటీల కూర్పును చూసినట్లయితే పార్టీలో రాజకీయ నిరుద్యోగులందరికీ పని కల్పించినట్లనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఇదేవిధంగా అందరికీ పని కల్పించినప్పటికీ పార్టీని గెలిపించుకోలేకపోయారు. లోక్‌సభ ఎన్నికలలో 17 స్థానాలలో 16 స్థానాలు మేమే గెలుచుకోబోతున్నామని తెరాస నమ్మకంగా చెపుతున్నందున ఈ 5కాంగ్రెస్ కమిటీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు సాధిస్తాయో చూడాలి.