నాంపల్లి అగ్నిప్రమాదంపై విజయశాంతి చురకలు

సీనియర్ మహిళా కాంగ్రెస్‌ నేత విజయశాంతి మొన్న నాంపల్లి  ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. “కేసీఆర్‌ ప్రభుత్వం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే...‘మంత్రులు లేని ప్రభుత్వం...నీళ్ళు లేని ఫైర్ ఇంజన్లు’ ప్రజల ప్రాణాలకు విలువ తెలియని ప్రభుత్వం ఇది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతున్నా ఇంత వరకు మంత్రివర్గమే ఏర్పాటు చేయలేదు. కేవలం రాజకీయ కారణాలతో మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉందా? ఇలాంటి పాలన కోసమా తెలంగాణ తెచ్చుకొన్నాము? ఇప్పటికైనా సిఎం కేసీఆర్‌ తక్షణమే మంత్రివర్గం ఏర్పాటు చేయాలి. నాంపల్లి  ఎగ్జిబిషన్ అగ్నిప్రమాద బాధితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలి,” అని అన్నారు.