పంచాయతీ పాలనకు ముహూర్తం ఖరారు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసి పాలకమండళ్ళు ఏర్పాటవడంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌ పంచాయతీ పాలనకు ముహూర్తం ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీలన్నీ ఫిబ్రవరి 2వ తేదీన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు అందరూ ప్రమాణస్వీకారాలు చేయాలని ఆదేశించారు. ఆరోజు నుంచే పంచాయతీల సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 2 నుంచి వారి పదవీకాలం ప్రారంభం అవుతుంది. ఈసారి అనేక తండాలకు పంచాయతీ హోదా లభించడం, అనేక పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో సాధ్యమైనంత త్వరగా గ్రామాలలో అభివృద్ధి పనులు మొదలుపెట్టుకోవాలని పంచాయతీ సభ్యులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నిధులు అందించడానికి ప్రభుత్వం కూడా సిద్దంగా ఉంది కనుక ఫిబ్రవరి 2వ తేదీనా జరుగబోయే తొలి సమావేశంలోనే తమ తమ గ్రామాలలో ఏమేమీ అభివృద్ధి పనులు మొదలుపెట్టాలో చర్చించుకొని ప్రతిపాదనలు సిద్దం చేసుకోవచ్చు.