
చేవెళ్ళ తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చేవెళ్ళ నుంచి ఎవరిని నిలబెట్టాలా అని ఆలోచిస్తున్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రముఖ సినీనటుడు రాంచరణ్ భార్య ఉపాసనను నిలబెట్టాలని నిర్ణయించారని ఒక ఆంగ్లపత్రికలో వార్తా వచ్చింది. సినీ,రాజకీయ వర్గాలలో సహజంగానే ఆ ప్రతిపాదనపై చర్చలు మొదలయ్యాయి. ఈవిషయం ఉపాసన చెవిలో పడటంతో ఆమె వెంటనే స్పందిస్తూ, “సారీ..ఆ వార్త నిజం కాదు. ప్రస్తుతం నేను నా ఉద్యోగానికే పరిమితం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నా చిన్నాన్న. ఆయన చేవెళ్లకు చేస్తున్న సేవలు సాటిలేనివి. ఆయన భార్య సంగీతా రెడ్డి నాకు బాస్,” అని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.