కవితక్కతో మాట్లాడాలనుకొంటున్నారా?

మన ప్రజాప్రతినిధులలో ప్రజలతో చక్కటి సంబంధాలు నెరిపేవారిలో తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, తెరాస ఎంపీ కవిత ముందుంటారని అందరికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా వారిద్దరూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎంపీ కవిత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బుదవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రజలతో ముఖాముఖీ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు. కనుక రాష్ట్ర ప్రజలు ఏదైనా అంశం గురించి ప్రశ్నించదలచుకుంటే ట్విట్టర్ లో ‘ఆస్క్ ఎంపీ కవిత’ హ్యాష్ ట్యాగ్‌కు ప్రశ్నలు పంపించవచ్చని ఆమె తెలియజేశారు. వాటికి ఆమె స్వయంగా సమాధానాలు చెపుతారు. కనుక ఎంపీ కవితతో మాట్లాడాలనుకునేవారు తక్షణం మీ సమస్యలను, సందేహాలను ఆమె ఖాతాకు పంపించండి.