త్వరలో మంత్రివర్గం ఏర్పాటు?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి సుమారు 2 నెలలు పూర్తికావస్తున్నప్పటికీ సిఎం కేసీఆర్‌ ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటుచేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. మంత్రిపదవులు ఆశిస్తున్న తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా లోలోన చింతిస్తున్నప్పటికీ ఎవరూ ధైర్యం చేసి అడగలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం రేపు లేదా ఫిబ్రవరి 7వ తేదీన 8మంది మంత్రులతో కూడిన మంత్రివర్గం ఏర్పాటుచేయబోతున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు, పార్లమెంటరీ కార్యదర్శులు, ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను కూడా సిఎం కేసీఆర్‌ ఖరారు చేస్తారని సమాచారం. మళ్ళీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరో 5మంది మంత్రులతో మంత్రివర్గం విస్తరణ చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.