రెండవ విడత ఎన్నికలలో కూడా కారు జోరు

రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగియడంతో 2గంటల నుంచి ఓట్లు లెక్కింపు మొదలైంది. రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో  రెండవ విడత ఎన్నికలలో మొత్తం 4,137 పంచాయతీలలో 788 గ్రామాలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మిగిలిన 3,342 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. 

రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో కూడా గులాబీ కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో ఏకగ్రీవాలతో కలిపి 694 మంది తెరాస బలపరిచిన అభ్యర్ధులు గెలిచారు. కాంగ్రెస్- 63, టిడిపి-6, బిజెపి-0, సిపిఐ-0, సిపిఎం-0, ఇతరులు-112 స్థానాలలో విజయం సాధించారు.

ఇక తొలివిడత ఫలితాలతో కలిపి చూసినట్లయితే తెరాస-3323, కాంగ్రెస్‌-983, టిడిపి-38, బిజెపి-67, సిపిఐ-19, సిపిఎం-32, ఇతరులు-871 స్థానాలలో విజయం సాధించారు.