
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక మళ్ళీ సర్వేలు కూడా మొదలైపోయాయి. తాజాగా ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్ సంస్థలు కలిసి ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగినట్లయితే, కాంగ్రెస్, బిజెపిలలో దేనికీ పూర్తి మెజారిటీరాదని వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పాటుకు 272 లోక్‌సభ సీట్లు అవసరంకాగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 237, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేకు 166, ఇతరులకు 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కనుక ఇతరుల మద్దతు లేనిదే కాంగ్రెస్, బిజెపిలు రెండూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని తేల్చి చెప్పింది. ఎన్డీయేకు 35 శాతం, యూపీయేకు 33 శాతం మాత్రమే ఓట్లు పొందుతాయని తాజా సర్వేలో తేలింది. ఈ సర్వే రెండు ప్రధానపార్టీల ప్రస్తుత పరిస్థితికి అద్ధం పట్టినప్పటికీ, ఎన్నికల సమయానికి ఈ లెక్కలలో చాలా మార్పులు వస్తాయి. కానీ ఈ సర్వే ఫలితాలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు గట్టి హెచ్చరిక వంటివేనని చెప్పవచ్చు.