4.jpg)
త్వరలో సిఎం కేసీఆర్ అమరావతి వెళ్ళి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తారని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దానికి ముహూర్తం కుదిరినట్లే కనిపిస్తోంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెంలో సొంత ఇల్లు, దానిలోనే పార్టీ కార్యాలయం నిర్మించుకొంటున్నారు. ఫిబ్రవరి 14న కొత్త ఇంట్లో గృహాప్రవేశం చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలందరినీ ఆహ్వానించడం ఖాయమే కనుక సిఎం కేసీఆర్ ఏపీ పర్యటన ఖాయమైనట్లే భావించవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతైన సిఎం కేసీఆర్ వెళ్లలేకపోయినట్లయితే, కేటీఆర్‌తో సహా తెరాస నేతలు తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరావుతారు. కనుక తెరాస నేతల ఏపీ పర్యటనపై మళ్ళీ టిడిపి-తెరాస నేతల మద్య మాటల యుద్దం ప్రారంభమవుతుందేమో?