రెండవ విడత పంచాయతీ ఎన్నికలు రేపే

మూడు విడతల పంచాయతీ ఎన్నికలలో మొదటివిడత పూర్తవడంతో శుక్రవారం రెండవ విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండవ విడతలో మొత్తం 4,137 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగవలసి ఉండగా వాటిలో 788 గ్రామాలో ఏకగ్రీవమయ్యాయి. కనుక రేపు మిగిలిన 3,342 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి.

యధాప్రకారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితాలు వెలువడగానే రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పద్దతిలో ఉప సర్పంచ్ ఎన్నిక జరిపిస్తారు. రెండవ విడత ఎన్నికలలో మొత్తం 10,668 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. పోటీ తీవ్రంగానే ఉంది కనుక ఈ ఎన్నికలలో కూడా డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈనెల 30న చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.