
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈరోజు హైకోర్టు నోటీస్ పంపింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈవీఎంలలో పోలైన ఓట్లకు, వీవీ ప్యాట్లలో పోలైన ఓట్లకు చాలా తేడాలున్నాయని, ఎన్నికల కౌటింగ్ అధికారులపై తెరాస నేతలు ఒత్తిళ్ళు చేయడంతో కౌంటింగులో అవకతవకలు జరిగాయని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 330 ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి మల్‌రెడ్డి రంగారెడ్డి వేసిన పిటిషనుపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈనెల 30వ తేదీలోగా ఆ నియోజకవర్గంలో పోలింగ్ వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ ఎన్నికల సంఘానికి నోటీసు పంపింది.
మల్‌రెడ్డి రంగారెడ్డి మొదట ఎన్నికల సంఘం ప్రధానాధికారి రంజిత్ కుమార్ ను కలిసి పోలింగ్ అవకతవకల గురించి ఫిర్యాదు చేశారు. కానీ ఆయన పట్టించుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ పోలింగులో అవకతవకలు జరిగాయని మల్‌రెడ్డి రంగారెడ్డి కోర్టులో నిరూపించగలిగితే, ఎన్నికల సంఘానికి, తెరాస అభ్యర్ధికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు.