
దేశంలోని ఉత్తమ పార్లమెంటు సభ్యులలో ఒకరిగా తెరాస ఎంపీ కవిత ఎన్నికయ్యారు. ఫేమ్-ఇండియా-ఆసియా పోస్ట్ మేగజైన్ ఇటీవల ‘సర్వ శ్రేష్ట్ సంసద్’ అనే పేరిట ఒక సర్వే నిర్వహించింది. దానిలో వివిద రాష్ట్రాలకు చెందిన మొత్తం 25 మంది ఎంపీలను ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపిక చేసింది. పార్లమెంటు సమావేశాలకు హాజరవడం, చర్చలలో చురుకుగా పాల్గొనడం, వివిద అంశాలపై ప్రశ్నలు అడిగి కేంద్రప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడం, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి వివిద అంశాల ప్రాతిపదికగా ఉత్తమ పార్లమెంటేరియన్లను ఎంపిక చేశారు. వారిలో తెరాస ఎంపీ కవిత కూడా ఒకరు. ఈ నెల 31వ తేదీన డిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో జరుగబోయే కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోబోతున్నారు.