సంబంధిత వార్తలు

మొదటి దశ పంచాయతీ ఎన్నికలలో కూడా తెరాస బలపరిచిన అభ్యర్ధులే
దూసుకుపోతున్నారు. మొదటి దశలో 769 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో
మిగిలిన 3710 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల
నుంచి 3 గంటలవరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 602 పంచాయతీలను తెరాస బలపరిచిన అభ్యర్ధులు
విజయం సాధించారు. కాంగ్రెస్-34, సిపిఎం-6, సిపిఐ-2, బిజెపి-2, ఇతరులు 106
గెలుచుకున్నారు.