మొదటిదశ పంచాయతీ ఎన్నికలు నేడే

మొదటిదశ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష ఎన్నిక పద్దతిలో ఉప సర్పంచ్ ఎన్నికను జరిపిస్తారు. దాంతో పంచాయతీల ఏర్పాటు పూర్తవుతుంది. ఈరోజు మొదటి దశలో 4,479 పంచాయతీలకు ఎన్నికలు జరుగవలసి ఉండగా వాటిలో 769 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే వాటిలో 39,822 వార్డులకు ఎన్నిక జరుగవలసి ఉండగా 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కనుక మిగిలిన 3710 గ్రామ పంచాయతీలకు, 29,168 వార్డులకు ఎన్నికలు జరిగుతున్నాయి.