తెలంగాణ శాసనసభాపతిగా పోచారం

మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శాసనసభాపతి పదవికి ఈరోజు నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా సీఎం కేసీఆర్‌తోపాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్‌ బలాల, సురేఖా నాయక్‌, అబ్రహంలు ప్రతిపాదనలు దాఖలు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సిఎం కేసీఆర్‌ పోచారం పేరును  ప్రతిపాదించినప్పుడు ఇక తెరాసలో వేరెవరూ నామినేషన్ వేసే ఆలోచన చేయరు కనుక పోచారం ఎన్నిక లాంఛనప్రాయమేనని భావించవచ్చు.