కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని నీటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్ధి విశ్వనాధ్ తన ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తు బుధవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. ఈరోజు ఆయన నామినేషన్ వేయవలసి ఉంది. కానీ ఆయనను అడ్డుకొనేందుకే ప్రత్యర్ధులు కిడ్నాప్ చేసి ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హుటాహుటిన అయాన్ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడినా తరువాత కిడ్నాప్ వ్యవహారం గురించి ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు నిటూరు గ్రామానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వనాధ్ ను కిడ్నాప్ చేయడం వలన ఆయన ఈరోజు నామినేషన్ వేయలేకపోయారు.