
కొత్తగా ఏర్పడిన రాష్ట్ర శాసనసభకు నాంది పలుకుతూ శాసనసభ్యులా చేత ప్రమాణస్వీకారం చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక స్పీకర్ (ప్రోటెం స్పీకర్) పేరును సూచిస్తే దానికి గవర్నర్ (నరసింహన్) ఆమోదం తెలుపడం ఆనవాయితీ. ఈసారి తాత్కాలిక స్పీకరుగా మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ పేరును సిఎం కేసీఆర్ ప్రతిపాదించగా దానిని ఆమోదించి, ఆయనను తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తూ గవర్నర్ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ నరసింహన్ ఆయన చేత జనవరి 16వ తేదీన రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ మరునాడు ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత స్పీకర్, డెప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవడంతో రాష్ట్రంలో కొత్త శాసనసభ కొలువుతీరుతుంది. అప్పటి నుంచి శాసనసభా కార్యక్రమాలు మొదలవుతాయి.