
తమిళనాడుకు చెందిన ట్రాన్స్జెండర్ (నపుంసక) అప్సర రెడ్డిని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమింపబడ్డారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ట్రాన్స్జెండర్ అయినంత మాత్రన్న ఆమెను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆమె తమిళనాడులో ప్రముఖ జర్నలిస్టులలో ఒకరు. అప్సర రెడ్డి తొలుత అన్నాడిఎంకె పార్టీలో కొంతకాలం అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 2016లో బిజెపిలో చేరి అప్పటి నుంచి నేటి వరకు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. కానీ తమిళనాడులో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మారి అత్యున్నత పదవిని పొందారు.