
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ మారింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ నియమావళిలో మార్పులు చేసింది. ఇక నుంచి పంచాయతీ ఎన్నికల కోడ్ కేవలం ఎన్నికలు జరుగుతున్న ఆయా గ్రామాలకే పరిమితమవుతుంది. పొరుగునే ఉన్న పట్టణాలకు పంచాయతీ ఎన్నికల కోడ్ వర్తించదని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిన్న మార్పు వలన ప్రభుత్వానికి ఆంక్షల బాధ తప్పుతుంది కనుక యధాప్రకారం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది.
సింగరేణి మరియు ఆర్టీసీ ఉద్యోగులలో గ్రామాలలో ఓటు హక్కు కలిగి ఉన్నవారికి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయవచ్చునని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. కానీ మేనేజర్, సెక్రటరీ వంటి ఉన్నతస్థానాలలో ఉన్న అధికారులకు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి వీలులేదని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు.