తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి మంగళవారం సాయంత్రం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 

1. జనవరి 7 నుంచి 21వరకు: 4,480 పంచాయతీలకు, 

2. జనవరి 11 నుంచి 25 వరకు: 4,137 పంచాయతీలకు,

3. జనవరి 16 నుంచి 30 వరకు: 4,115 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబడతాయి. 

అంటే 7 నుంచి జనవరి నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం అవుతోంది. రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, వెంటనే ఓట్లు కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్నికైన సభ్యులు ప్రత్యక్ష పద్దతిలో సర్పంచ్ లను ఎన్నుకొంటారని నాగిరెడ్డి తెలిపారు.

ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తామని ఈ ఎన్నికలలో కూడా బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ ఆపషన్ ఉంటుంది. ఈ ఎన్నికలలో సర్పంచ్ పదవికి పోటీ చేయదలచిన జనరల్ అభ్యర్ధులు రూ. 2,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్ధులు రూ. 1,000 డిపాజిట్ చెల్లించాలని నాగిరెడ్డి తెలిపారు. 5,000 మంది అంతకంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్ధులు రూ.1 లక్ష, అంతకు మించి జనాభా ఉన్న గ్రామాలలో రూ.2.5 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చునని నాగిరెడ్డి తెలిపారు. ఆ పరిమితికి మించి ఖర్చు చేసినట్లు రుజువైతే సర్పంచ్ గా ఎన్నికైనప్పటికీ పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుందని అభ్యర్ధులు గుర్తుంచుకోవాలని నాగిరెడ్డి చెప్పారు.