హైదారాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కాచిగూడా రైల్వే స్టేషన్ ఏడవ నిజాం నవాబు అసఫ్ జా కాలంలో 1916లో నిర్మించబడింది. అది నేటికి 102 సం.లు సర్వీస్ పూర్తి చేసుకొని రాష్ట్రంలో అత్యుత్తమ, అతి ఎక్కువ రద్దీ ఉన్న రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో ఇతర రైల్వే స్టేషన్లకు భిన్నంగా గోటిక్ ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించబడటంతో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ గుర్తింపు, అవార్డు పొందింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కాచిగూడ రైల్వే స్టేషన్ లో తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిభింబించే విదంగా తీర్చిదిద్దారు.
దక్షిణమద్య రైల్వేలో హైదారాబాద్ డివిజన్ లో భాగమైన కాచిగూడా రైల్వేస్టేషన్ నిజామాబాద్ జిల్లాతో పాటు, నాందేడ్, మంగళూరు, తిరుపతి, గుంటూరు, చెన్నై, డిల్లీ, బెంగళూరు, భోపాల్, ఇండోర్ మొదలైన ప్రాంతాలకు వెళ్ళే 21 రైళ్ళతో నిత్యం రద్దీగా ఉంటుంది.