
భారత
అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తలపెట్టిన గగన్యాన్ప్రాజెక్టుకుకేంద్రప్రభుత్వం ఆమోదం
తెలిపింది. దీని కోసం రూ.10,000
కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర
మంత్రివర్గం ప్రకటించింది.దీంతో
ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నగగన్యాన్ప్రాజెక్టుకుమార్గం సుగమం అయ్యింది.
ఇస్రో
మొట్టమొదటిసారిగా ముగ్గురు వ్యోమగాములను గగన్యాన్ప్రాజెక్టు ద్వారా
అంతరిక్షంలోకి పంపించాలని ప్రతిపాదనలు చేసింది. ఐఎస్ఆర్ఓకు నమ్మినబంటుగా
పేర్కొనబడుతున్న జీఎస్ఎల్వీ మార్క్-3ద్వారా వారిని అంతరిక్షంలోకి
పంపిస్తుంది. దీనితో భారత్ కూడా మానవసహిత ప్రయోగాలలో అగ్రదేశాలతో పోటీపడే స్థాయికి
ఏడుగుతుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే తరువాత చంద్రయాన్ అనే మరో ప్రాజెక్టుకు ఇస్రో
సిద్దం అవుతోంది. ఆ ప్రాజెక్టులో చంద్రుడిపైకి భారత వ్యోమగాములను పంపాలనేది ఇస్రో
కల. కనుక ఇస్రోకు ఈ ప్రయోగం చాలా కీలకం కానుంది.