హైకోర్టు విభజనకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

గత నాలుగేళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న హైకోర్టు విభజనకు కేంద్రప్రభుత్వం ఈరోజు సాయంత్రం గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా  న్యాయమూర్తులను కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

తెలంగాణ రాష్ట్రానికి 10 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16మంది న్యాయమూర్తులను కేటాయించబడ్డారు. జనవరి 1,2019 నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయడం ప్రారంభిస్తాయని గెజెట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.

రెండు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధానన్యాయమూర్తుల పేర్లను ఇంకా ఖరారు చేయవలసి ఉంది. ఆంధ్రాకు కేటాయించిన న్యాయమూర్తులలో ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేరు ఉన్నందున, ఆయనను ఏపీ హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా నియమించి, ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న టిబిఎన్ రాధాకృష్ణన్ ను తెలంగాణ హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా కొనసాగించవచ్చునని భావించవచ్చు. 

తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన న్యాయమూర్తులు: 

జస్టిస్ టి.అమరనాథ్ గౌడ్, జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డి,  జస్టిస్ సి.కోదండరామ చౌదరి, జస్టిస్ పి.కేశవ రావు, జస్టిస్ బి. శివశంకర రావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పి.వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ యం.సత్యరత్న శ్రీరామచంద్ర రావు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేటాయించిన న్యాయమూర్తులు:

జస్టిస్ రమేశ్ రంగనాథన్(ప్రస్తుతం ఉత్తరాఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి),జస్టిస్ శ్రీమతి కె. విజయ లక్ష్మీ, జస్టిస్ శ్రీమతి టి.రజనీ, జస్టిస్ కుమారి జే.ఉమాదేవి, జస్టిస్ గంగారావు, జస్టిస్ యు. దుర్గాప్రసాద్ రావు, జస్టిస్ ఏ. వెంకట శేషసాయి, జస్టిస్ ఎన్. బాలయోగి, జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ డి.వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్ డి. శేషాద్రి నాయుడు (ప్రస్తుతం కేరళ హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు), జస్టిస్ జి.శ్యామ్ ప్రసాద్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సిహెచ్. ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం. సీతారామ మూర్తి, జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి.