
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సిఎం కేసీఆర్‌కు మంగళవారం ఒక బహిరంగలేఖ వ్రాశారు. పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు 15వ తేదీన జారీచేసిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్లుందని దానిని తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. పంచాయతీ ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ల శాతం తగ్గించడాన్ని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తప్పు పట్టారు. బీసీ జనాభా లెక్కలు తీసి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలుచేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను పునః పరిశీలించి అర్హులైనవారిని మళ్ళీ జాబితాలో చేర్చాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరారు.