భారతరత్న వాజ్‌పేయీ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల

దివంగత ప్రధాని భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 94వ జయంతి నేడు. ఈ సందర్భంగా డిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వాజ్‌పేయీ జ్ఞాపకార్ధం రూ.100 నాణేన్ని విడుదల చేశారు. డిల్లీలో రాజ్‌ఘాట్‌ సమీపంలో రూ.10.51 కోట్ల వ్యయంతో, 1.5 ఎకరాల స్థలంలో నిర్మించిన ‘సదైవ అటల్‌’ అనే స్మారక కేంద్రాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు ప్రముఖులు, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.