పంచాయతీ లెక్క తేలింది

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సోమవారం రాత్రి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈవిధంగా ఉన్నాయి. 

బీసీలకు: 22.79 శాతం

ఎస్సీలకు: 20.53 శాతం

ఎస్టీలకు: 6.68 శాతం

ఇక పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఈవిధంగా ఉన్నాయి. 

మొత్తం పంచాయతీలు: 12,751 

ఎస్సీ: 1,281 పంచాయతీలు (20.53 శాతం)

ఎస్టీ: 1,177 పంచాయతీలు (6.68 శాతం)

మిగిలినవి: 10,293 పంచాయతీలు (వాటిలో 50 శాతం మహిళలకు కేటాయించింది.)

మహిళలకు కేటాయించినవి: 6,378 పంచాయితీలు 

బీసీ: 2,345 పంచాయతీలు (22.79 శాతం) 

జనరల్ అండ్ అన్ రిజర్వ్డ్ : 5,147 (50 శాతం)

వీటికి 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలు, మండలాలలో రిజర్వేషన్లు సర్దుబాటు చేసి ఈనెల 29వ తేదీలోగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాలువారిగా జారీ అయిన గెజెట్ నోటిఫికేషన్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. అప్పటి నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. కనుక జనవరి మొదటివారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలవబోతోంది.