
సిఎం కేసీఆర్ సోమవారం ఉదయం సతీసమేతంగా భువనేశ్వర్ నుంచి కారులో పూరీ చేరుకొని జగన్నాధస్వామివారిని దర్శించుకున్నారు. కేసీఆర్ దంపతులకు పూరీ ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ దంపతులుజగన్నాధస్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించిన తరువాత అక్కడి నుంచి నేరుగా కారులో కోణార్క్ ఆలయానికి బయలుదేరారు. అక్కడి సూర్యభగవానుడిని దర్శించుకొన్న తరువాత మళ్ళీ భువనేశ్వర్ చేరుకొని విమానంలో కోల్ కతాకు బయలుదేరుతారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అయిన తరువాత కోల్ కతాలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఈరోజు రాత్రి డిల్లీ బయలుదేరి వెళతారు.
రేపటి నుంచి మూడు రోజులు డిల్లీలోనే బస చేస్తారు. రేపు ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం కేంద్రమంత్రులను, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బిఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి వారితో జాతీయ కూటమి గురించి చర్చిస్తారు.