నేడు కరీంనగర్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి కోవింద్

శీతాకాలం విడిదిలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నాలుగు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈరోజు అంటే శనివారం ఆయన కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని నాగునూర్ మండలంలోని గల ప్రతిమ మెడికల్‌ కాలేజీ ఆడిటోరియమ్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు అక్కడ జరిగే ఒక కార్యక్రమంలో ఆ కాలేజీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు మెడికల్ విద్యార్ధులకు బంగారు పతకాలను బహూకరిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మహారాష్ట్ర గవనర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విద్యార్ధులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు.