
నేటి నుంచి వరుసగా 5-6 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇవాళ్ళ అంటే శుక్రవారం ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాయి. కనుక ఈరోజు బ్యాంకులు పనిచేయవు. రేపు రెండవ శనివారం గనుక బ్యాంకులకు శలవు. ఆదివారం ఎలాగూ బ్యాంకులకు శలవే. సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. కానీ ఆమర్నాడు అంటే డిసెంబరు 25న క్రిస్మస్ పండుగ ఉంది కనుక ఉద్యోగులు సోమవారం ఐచ్చిక శలవు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఆరోజున బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవచ్చు. డిసెంబరు 26వ తేదీన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తమ డిమాండ్ల సాధన కొరకు సమ్మెకు పిలుపునిచ్చాయి. కనుక ఆ రోజు బ్యాంకులు పనిచేయకపోవచ్చు. ఈ లెక్కన నేటి నుంచి డిసెంబరు 26 వరకు బ్యాంకులు పనిచేయవని స్పష్టం అవుతోంది. కనుక ప్రజలందరూ వారం రోజులకు సరిపడినంత నగదును చేతిలో ఉంచుకొంటే మంచిది.