
దేశంలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా జాతీయకూటమిని ఏర్పాటు చేస్తానని సిఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆయన దీనికోసం ఆయన చేసిన ప్రయత్నాల గురించి అందరికీ తెలుసు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “నెలరోజులలోగా తన కార్యాచరణ ప్రకటిస్తానని కేసీఆర్ చెప్పారు. అయితే ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, జాతీయకూటమి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలలో భాగంగా ఈనెలాఖరులోగా భువనేశ్వర్ వెళ్ళి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో దీని గురించి చర్చించబోతున్నట్లు తాజా సమాచారం. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ కనుక భువనేశ్వర్ నుంచి నేరుగా డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. ఈనెల 24వ తేదీన సిఎం కేసీఆర్ భువనేశ్వర్ వెళ్ళవచ్చునని తెలుస్తోంది.
మార్చి-ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తే ఎన్నికలలోపుగానే జాతీయకూటమి ఏర్పడవచ్చు.