తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను పొందేందుకు ప్రస్తుతం ఉన్న 65 ఏళ్ళు వయోపరిమితిని 57 ఏళ్ళకు తగ్గించి, పెన్షన్ అర్హతలను తెలియజేస్తూ మార్గదర్శకాలను ప్రకటించింది.
అర్హతలు-అనర్హతలు:
1. ఈ పెన్షన్ పొందేందుకు ఓటరు కార్డులో పేర్కొన్న వయసును ప్రామాణికంగా తీసుకోబడుతుంది.
2. 1953-1961 మద్య జన్మించి ఉండాలి.
3. 57 ఏళ్ళు దాటినవారెవరైనా అర్హులే.
4. 3ఎకరాలు మాగాణీ భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్టభూమి ఉన్నవారు దీనికి అనర్హులు.
5. గ్రామాలలో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, నగరాలలో రూ.2.0 లక్షలకు మించి ఉన్నవారు దీనికి అనర్హులు.
6. వైద్యులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, ఇతర వృత్తులలో అధిక ఆదాయం ఉన్నవారి తల్లితండ్రులు ఈ పధకానికి అనర్హులు.
7. ఎటువంటి పెద్ద వ్యాపారాలున్నవారు దీనికి అనర్హులు.
8. రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు, ఇతర పధకాలలో లబ్ధిపొందుతున్నవారు దీనికి అనర్హులు.
9. ఐటి రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారు, సొంత వాహనాలున్నవారు దీనికి అనర్హులు.
10. ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగుల తల్లితండ్రులు దీనికి అనర్హులు.
పైన పేర్కొన్న నిబందనల ప్రకారం వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులైనవారు వృద్ధాప్య పింఛనుకు ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలంటే...
1. గ్రామాలలో నివసిస్తున్నవారైతే వీఆర్వోలకు, పట్టణాలలో బిఎల్ఎఫ్ కలెక్టర్లకు దరఖాస్తు అందజేయవలసి ఉంటుంది. వారికే ఆధార్, బ్యాంక్ తదితర వివరాలను అందజేయవలసి ఉంటుంది.
2. ఎంపిక చేసిన లబ్దిదారుల ముసాయిదా జాబితాను ముందుగా గ్రామ లేదా వార్డు సభలలో ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తారు.
3. గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను కలెక్టర్లకు పంపుతారు.
4. లబ్ధిదారుల తుది జాబితాను ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతమున్న ‘ఆసరా’ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తారు.
5. అప్పటి నుంచి నెలకు రూ.2,000 చొప్పున ప్రతీనెలా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమా చేయబడుతుంది.