
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే ఆ పార్టీలో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరవచ్చునని ముందే ఊహించినట్లుగానే సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), వనమా వేంకటేశ్వరరావు( కొత్తగూడెం), కందాళ ఉపేందర్ రెడ్డి (పాలేరు), పోదెం వీరయ్య (భద్రాచలం) తెరాసలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుమారు 7-8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరే అవకాశం ఉందని వారు పార్టీలో చేరిన తరువాతే మంత్రివర్గం ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరవచ్చుననే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. అయితే తాము ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని వీడబోమని తమను తెరాసలోకి రప్పించేందుకే ఆ పార్టీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని, మీడియాలో వస్తున్న ఆ పుకార్లను నమ్మవద్దని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.