
పరకాల నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ మొదటిసారిగా నేడు మీడియా ముందుకు వచ్చారు. “ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు చిరకాలంగా సేవ చేస్తున్న నాకు భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం ఉండేది. కానీ ఏ ఒక్క రౌండులో నాకు ఆధిఖ్యత రాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం కలుగుతోంది. ఏమైనప్పటికీ ఆదివారం ప్రజాతీర్పు కనుక దానికి కట్టుబడి ఉండక తప్పదు. గెలుపోటములతో సంబందం లేకుండా ఎల్లప్పుడూ మేము ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము,” అని కొండా సురేఖ అన్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం గురించి స్పందిస్తూ, “అవన్నీ ప్రజలను మభ్యపెట్టి కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆడుతున్న ఒట్టొట్టి డ్రామాలే. త్వరలోనే అందరూ అది చూడబోతున్నారు,” అని కొండా సురేఖ అన్నారు.