తెరాసలో చేరిన ఇద్దరు రెబెల్ అభ్యర్ధులు

అసెంబ్లీ ఎన్నికలలో తెరాస 88 సీట్లు గెలుచుకోగా దాని బలం ఇప్పుడు 90కు పెరిగింది. తెరాస రెబెల్ అభ్యర్ధిగా రామగుండం నుంచి పోటీ చేసి గెలిచిన కోరుకుంటి చందర్, అదేవిధంగా కాంగ్రెస్‌ రెబెల్ అభ్యర్ధిగా వైరా నుంచి పోటీ చేసి గెలిచిన లావుడ్య రాములు నాయక్‌ ఇద్దరూ బుదవారం కేటిఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. మరో ఐదేళ్ళవరకు తెరాసయే అధికారంలో ఉండబోతోంది కనుక మళ్ళీ కాంగ్రెస్, టిడిపిలలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెరాసలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. కనుక వలసలకు ఇది ప్రారంభంగా భావించవచ్చు.