రేపు కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

కేసీఆర్‌ ఈరోజే ప్రమాణస్వీకారం చేస్తారని అందరూ భావించినప్పటికీ, ఆయన జాతకరీత్యా రేపు అంటే గురువారం  మధ్యాహ్నం 12.50-1.30 గంటల మద్య రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తారని తాజా సమాచారం. ఆయనతో పాటు 5 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తాజా సమాచారం. మరికొద్ది సేపటిలో తెలంగాణభవన్‌లో తెరాస శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఆ తరువాతే రేపు కేసీఆర్‌తో పాటు ఎవరెవరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారో తెలియవచ్చు. గత మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించనందుకు కేసీఆర్‌ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కనుక ఈసారి తప్పకుండా ఒక మహిళా ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉండవచ్చు.