.jpg)
రాష్ట్రంలో మధ్యాహ్నం ఒంటి గంటవరకు హుషారుగా సాగిన పోలింగ్, భోజనవిరామం అనంతరం మందకోడిగా సాగుతుండటంతో మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రంలో 56.17 శాతం మాత్రమే నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 నియోజకవర్గాలైన సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల్, అసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఎల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలలో పోలింగ్ ముగిసింది. ఇక మిగిలిన 106 నియోజకవర్గాలలో మరొక అర్ధగంటలో పోలింగ్ ముగియబోతోంది. కనుక ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న తీరు చూస్తే ఈసారి 65-70 శాతంకు మించి జరిగే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తున్నప్పటికీ, ఆలోగా వచ్చి క్యూలో నిలబడినవారందరికీ ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం ముందే తెలిపింది. కనుక ఏ కొద్దిపాటి సమయంలో ఎంతమంది వస్తారో చూడాలి. ఒకవేళ ఈసారి కూడా 65 శాతంకు మించకపోతే అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చు.