చిరంజీవి లైన్లోకి వచ్చారు

ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్‌ నేత చిరంజీవి సతీసమేతంగా వచ్చి జూబ్లీహిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గత ఎన్నికలలో చిరంజీవి క్యూ లైన్లో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూతులోకి వెళ్ళి ఓటేసేందుకు ప్రయత్నించినప్పుడు ఒక యువ ఓటరు అభ్యంతరం చెప్పడంతో సర్ద్ధిచెప్పుకొని వెనక్కు వెళ్ళి క్యూలైన్లో నిలబడి ఓటేయవలసి వచ్చింది. ఆ చెడు అనుభవం కారణంగా ఈసారి చిరంజీవి మిగిలిన ఓటర్లతో పాటు క్యూలైన్లో నిలబడి ఓటు వేసి వచ్చారు. అయితే ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ మాత్రం ఈసారి ఓటు వేయలేకపోయారు. ఆయన సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళి ఉన్నందున రాలేకపోతున్నారని చిరంజీవి చెప్పారు.