కేసీఆర్‌పై మర్రి సంచలన వ్యాఖ్యలు

సీనియర్ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి సిఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మరికొద్ది సేపటిలో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. నాకు అందిన సమాచారం మేరకు సిఎం కేసీఆర్‌ గజ్వేల్ లో తన చివరి సభ ముగించుకోగానే హటాత్తుగా స్పృహ తప్పి పడిపోయినట్లు నటిస్తారు. ఆయనను తెరాస నేతలు హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలిస్తారు. ఇదంతా ప్రజల సానుభూతి పొందడం కోసం తెరాస ఎన్నికల వ్యూహంలో భాగంగా కేసీఆర్‌ ఆడబోతున్న నాటకమే. మరికొద్ది సేపటిలో మీరే చూడబోతున్నారు,” అని అన్నారు.