ఆ కారులో ఐదుగురికే చోటుంది: కుష్బూ

సాధారణంగా చాలా సినిమాలలో సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ప్రేక్షకులకు సినిమా బోరు కొట్టకుండా ఉండేందుకే అది. అలాగే రాష్ట్రంలో చాలా వాడివేడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో కూడా వివిద పార్టీల నేతలు మంచి కామెడీ పండిస్తూ ప్రజల చేత చప్పట్లు కొట్టించుకొంటున్నారు. 

సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్‌ నేత కుష్బూ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “తెరాస ఎన్నికల గుర్తు కారు. ఆ కారులో ఐదుగురికి మాత్రమే చోటుంటుంది. ఆ ఐదుగురూ కేసీఆర్‌ కుటుంబ సభ్యులు. వెనుక డిక్కీలో కూడా చోటుంటుంది. కానీ దానిలో డబ్బు మూటలు నిండి ఉంటాయి,” అని ఛలోక్తి విసిరారు. 

కేసీఆర్‌: కొండా మురళీ గుండానా? ఒక్క తొక్కు తొక్కితే పాతాళానికి పోతాడు. 

కేసీఆర్‌: రాహుల్ గాంధీ ఓ రాజకీయ జోకర్...మోడీకి తెలివి లేదు...బాబుకు ఎప్పుడూ పక్క చూపులే!   

కేటిఆర్‌: బాబు ఇక్కడ రాజకీయాలలో వేలు పెడితే మేము అక్కడి (ఆంధ్రప్రదేశ్) రాజకీయాలలో వేలు పెడతాము. 

కేటిఆర్‌: ఆ గట్టునుంటారా... ఈ గట్టునుంటారా?

కవిత: మాకు సొంత ఇల్లు లేదు అద్దె ఇంట్లో ఉంటున్నాము. 

హరీష్ రావు: శనీశ్వరుడు కావాలా... కాళేశ్వరం ప్రాజెక్టు కావాలా?

రాహుల్ గాంధీ: కేసీఆర్‌ అంటే కమీషన్ కావ్ రావు.  

రాహుల్ గాంధీ: బిజెపికి బి టీం తెరాస, సి టీం మజ్లీస్   

కేంద్ర మంత్రి రవిశంకర్: రాహుల్ ఓ అయోమయ గాంధీ!

చంద్రబాబు: ఏం తమ్ముళ్లూ కేసీఆర్‌ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిద్దామా?

చంద్రబాబు: అక్కడ పెద్ద మోడీ.. ఇక్కడ చిన్న మోడీ!        

ఉత్తమ్ కుమార్ రెడ్డి: కేసీఆర్‌కు ఇంకా 6 రోజులే మిగిలుంది.    

మందకృష్ణ: అన్నం పెట్టినోడికే కేసీఆర్‌ సున్నం పెడతాడు.      

కోదండరామ్‌: కేసీఆర్‌ క్రికెట్ పోటీలో ‘గాయపడిన బ్యాట్స్ మ్యాన్’ ఆయన ఆట పూర్తయిపోయింది.

కోదండరామ్‌: గెలిచినా, ఓడినా ఫాం హౌసులో పడుకొంటాననేవాడికి ఓట్లు ఎందుకు? 

విజయశాంతి: కేసీఆర్‌ మాయల మరాఠీ. 

మధూ యాష్కీ: కేసీఆర్‌ ఏక్ నంబరీ..కేటిఆర్‌ దస్ నంబరీ 

గూడూరు నారాయణ రెడ్డి(టీపీసీసీ కోశాధికారి): హైదరాబాద్‌ను డల్లాస్ లా కాదు డర్టీ సిటీగా మార్చారు.

సండ్ర వెంకటవీరయ్య: కొడుకు కోసమే సిరిసిల్లా జిల్లా ఏర్పాటు. 

సుహాసిని: ప్రజలకు సేవ చేయడానికే పోటీ చేస్తున్నా!      

బిజెపి: ఒక్క ఛాన్స్ ప్లీజ్!