నగరంలో నేడు మళ్ళీ చంద్రబాబు రోడ్ షోలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం టిడిపి అభ్యర్ధులకు మద్దతుగా హైదరాబాద్‌ నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆయన కార్యక్రమ వివరాలు: 

ఉదయం 10.30 గంటలకు అల్కాపురి క్రాస్‌రోడ్డు నుంచి రోడ్‌ షో మొదలుపెడతారు. చింతచెట్టు సెంటర్‌, సచివాలయం కాలనీ, గోల్డెన్‌ టెంపుల్‌, పైపులైను రోడ్డు, హుడా కాలనీ, ఓయూ కాలనీ, పంచవటీ కాలనీ మీదుగా మణికొండలో మర్రిచెట్టు సెంటర్‌ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. 11.30 గంటలకు అక్కడే బహిరంగసభలో ప్రసంగిస్తారు. 

మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సుజనా ఫోరంమాల్‌ మీదుగా జేఎన్‌టీయూ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం అక్కడ బహిరంగసభ నిర్వహిస్తారు. 

భోజన విరామానంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లిలో బహిరంగసభలలో పాల్గొంటారు. 

రాత్రి 7 గంటలకు వై జంక్షన్ వద్ద ఆ తరువాత మూసాపేట, మోతీ నగర్ వద్ద బహిరంగసభలో పాల్గొంటారు.