రేవంత్‌రెడ్డికి హై సెక్యూరిటీ

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వేసిన పిటిషనుపై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్, ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రేవంత్‌రెడ్డికి 4+4 భద్రత మరియు ఎస్కార్ట్ సర్వీసును కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనకు భద్రత కల్పించాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప కేంద్రానిది కాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించి ఈ తీర్పు వెలువరించింది.