7.jpg)
ఈరోజు మేడ్చల్ లో జరిగినన కాంగ్రెస్ బహిరంగసభలో కోదండరామ్‌ను మాట్లాడుతూ, “గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలలో చాలా వరకు అమలుచేయక పోయినా అన్ని చేశామని అబద్దాలు చెపుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితులకు మూడెకరాల భూములు, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్ట్ కార్మికులకు కనీసవేతనాలు ఇవ్వలేదు. మద్దతు ధర అడిగినందుకు రైతులకు బేడీలు వేశారు. ఇసుక మాఫియాను నిలదీసినందుకు దళితులను పోలీసుల చేత చితకబాదించారు. రేషన్ డీలర్ల కష్టాలను పట్టించుకోలేదు. రుణమాఫీ చేశామని చెపుతున్నారు కానీ ఒక్క రైతుకు కూడా దాని వలన ప్రయోజనం కలుగలేదు. తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేయించారు. ప్రజల, ప్రతిపక్షాల గళాలు వినిపించకుండా ధర్నా చౌక్ మూసేశారు.
కేసీఆర్ స్వయంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తన నాలుగేళ్ళ నియంతృత్వ పాలనను తొమ్మిది నెలల ముందుగా అంతం చేయడానికి మనకు అవకాశం కల్పించారు. కనుక అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కేసీఆర్‌కు ఓటేసినా ఆయన ఫాంహౌసులో పడుకొంటారు. వేయకపోయినా ఫాంహౌసులో పడుకొంటారు. కనుక గద్దె దిగి ఇంటికి వెళ్లిపోతామని చెపుతున్నవారికి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు. అటువంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు వేయనవసరం లేదు. ఆయనను తప్పకుండా ఫాంహౌసు పంపించాలి,” అని అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “మహాకూటమిలో మిత్రపక్షాల అభ్యర్ధులకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందరూ పూర్తిగా సహకరించి వారిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలను కూడా మహాకూటమిలో నాలుగు పార్టీల అభ్యర్ధులను సమానంగా ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ “కేసీఆర్ ఫాం హౌసుకు వెళ్లిపోవాలని తొందరపడుతున్నారు. కనుక ఆయనను ఫాం హౌసుకు పంపించవలసిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. డిసెంబరు 11 తరువాత కేసీఆర్ ఫాం హౌసుకు, కేటిఆర్ అమెరికాకు వెళ్లిపోవడం ఖాయమని అన్నారు.