ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలకు 3,584 దాఖలు కాగా, రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ రెబెల్ అభ్యర్ధులను బుజ్జగించుకొని వారిచేత నామినేషన్లు ఉపసంహరింపజేయగలిగాయి. శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసిన తరువాత ఇంకా 1,824 మంది అభ్యర్ధులు బరిలో మిగిలారు. అంటే దాదాపు 50 శాతం మంది అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకొన్నారన్న మాట. ఈ పరిణామం అన్ని పార్టీలకు చాలా ఉపశమనం కలిగిస్తుంది.
నిన్న నామినేషన్ల గడువు ముగిసిన తరువాత పాత 10 జిల్లాల ప్రకారం ఏ జిల్లాలో ఎంతమంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారో ఎన్నికల సంఘం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. వాటిలో హైదరాబాద్‌లో అత్యధికంగా 15 నియోజకవర్గాలకు 313 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలకు 91 మంది అభ్యర్ధులున్నారు.