ధైర్యం చేసినా ఫలితం దక్కలేదు పాపం

ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలలో టికెట్లు ఆశించి భంగపడిన అనేకమంది నేతలు రెబెల్ అభ్యర్ధులుగా నామినేషన్లు వేశారు. వారితోపాటు అనేకమంది స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు. కానీ వారు ధైర్యం చేసి నామినేషన్లు వేసినప్పటికీ వాటిలో తప్పులుండటంతో అనేకమంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. 

ఆ విధంగా నామినేషన్లు తిరస్కరించబడిన అభ్యర్ధులలో 

స్టేషన్ ఘన్‌పూర్‌: చింతా స్వామి (టిజేఎస్), శాగ రాజు (టీడీపీ)

జనగామ: ఇర్రి అహల్య(సీపీఎం), టీఏ ఆనంద్‌కుమార్‌ (ఇండిపెండెంట్‌)

పాలకుర్తి: కర్నె లక్ష్మణ్‌రావు( ఎల్.ఎస్.ఎస్.పి)

వర్ధన్నపేట: కొత్త ఇందిర (బీజేపీ), నమిండ్ల శ్రీనివాస్, బందెల రాజభద్రయ్య (కాంగ్రెస్‌), దూడల కట్టయ్య (జై మహాభారత్‌ పార్టీ) తవ్వల కమలాకర్‌, కాందారి కళావతిల నామినేషన్లు వేర్వేరు కారణాలతో తిరస్కరించబడ్డాయి.   

 వరంగల్‌ తూర్పు: జోన్నోతుల కిషన్‌ రెడ్డి (పిరమిడ్‌ పార్టీ), గోపాల కృష్ణమూర్తి (టీపీ సమితి), బోలుగోడ్డు శ్రీనివాస్‌ (బీఆర్‌ఎస్‌), జాకీర్‌ హూస్సేన్, కేడల ప్రసాద్, కుసుమ రాజు (ఇండిపెండెంట్‌) నామినేషన్లు వేర్వేరు కారణాలతో తిరస్కరించబడ్డాయి.   

వరంగల్‌ పశ్చిమ: పద్మారావు (బీజేపీ), ఎలిగేటి భాస్కర్‌, నీలం భాస్కర్‌ నామినేషన్లు వేర్వేరు కారణాలతో తిరస్కరించబడ్డాయి.   

భూపాలపల్లి: అర్షం అశోక్‌ స్వతంత్ర అభ్యర్ధి నిర్ణీత గడువు సమయం తరువాత నామినేషన్ సమర్పించినందుకు తిరస్కరించబడింది.  

ములుగు: లక్ష్మీనారాయణ  (సిపిఎం) నిర్ణీత గడువు సమయం తరువాత నామినేషన్ సమర్పించినందుకు తిరస్కరించబడింది. పరకాల:2, నర్సంపేట:3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 

కుత్బుల్లాపూర్‌: భరతసింహారెడ్డి, శ్రీనివాస్‌ (బిజెపి) బి-ఫారంలు సమర్పించలేకపోయినందుకు నామినేషన్లు  తిరస్కరించబడ్డాయి.