నేడు 5 సభలలో పాల్గోనున్న కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ 50 రోజులలో 100 బహిరంగసభలలో పాల్గొంటానని చెప్పి రెండున్నర నెలలలో పట్టుమని 10 సభలు కూడా నిర్వహించలేదనే మహాకూటమి నేతల విమర్శలకు సమాధానంగా కేసీఆర్‌ నిన్న నాలుగు సభలలో నేడు ఏకంగా ఐదు సభలలో పాల్గొనబోతున్నారు. అంటే రెండు రోజుల వ్యవదిలోనే 9 సభలు నిర్వహించబోతునారన్న మాట. 

కేసీఆర్‌ నేటి బహిరంగసభల వివరాలు: 

1. బుదవారం ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్‌లో జడ్చర్ల పట్టణం శివారులో బహిరంగసభలో పాల్గొంటారు. 

2. మధ్యాహ్నం 12 గంటలకు నల్లగొండ జిల్లాలోని దేవరకొండలోని ముదిగొండరోడ్డులోని మిషన్‌ కాంపౌండ్‌లో బహిరంగసభ నిర్వహిస్తారు. 

3. మధ్యాహ్నం ఒంటి గంటకు నకిరేకల్ పట్టణంలో సాయిబాబా ఆలయం సమీపంలోని మినీ స్టేడియంలో బహిరంగసభ నిర్వహిస్తారు. 

4. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 2.30 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహిస్తారు. 

5. అక్కడి నుంచి సాయంత్రం 4.00 గంటలకు మెదక్ జిల్లా కేంద్రం చేరుకొని బహిరంగసభ నిర్వహిస్తారు.