
మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఐకి కాంగ్రెస్ పార్టీ కేటాయించిన 3 స్థానాలకు ఆ పార్టీ బుదవారం సాయంత్రం అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. హుస్నాబాద్ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, వైరా నుంచి బానోతు విజయబాయి, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్ సిపిఐ అభ్యర్ధులుగా పోటీ చేయనున్నారు. వీరు ముగ్గురు ఈ నెల 17 లేదా 18వ తేదీన నామినేషన్లు వేస్తారని ఆ పార్టీ నేత పల్లా వెంకట్ రెడ్డి తెలిపారు. తాము పోటీ చేయబోతున్న స్థానాలలో కాంగ్రెస్, టిడిపిల నుంచి తిరుగుబాటు అభ్యర్ధులు బరిలో దిగకుండా నివారించవలసిన బాధ్యత ఆ రెండు పార్టీలదేనని అన్నారు. సిపిఐకి కేటాయించిన మూడు స్థానాలలో తప్పకుండా గెలుచుకొంటామని పల్లా వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.