కేంద్రమంత్రి అనంతకుమార్ మృతి

బిజెపి సీనియర్ నేత, కేంద్రమంత్రి అనంతకుమార్ (59) సోమవారం తెల్లవారుజామున బెంగళూరులో ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సంబదిత వ్యాధితో బాధపడుతున్నారు. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అనంత కుమార్ ఎరువులు, రసాయన శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 2016 నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అనంత కుమార్ మృతి చెందినట్లు తెలుసుకొని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.