రేవంత్‌రెడ్డి అలకపాన్పు?

కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అలకపాన్పు ఎక్కినట్లు సమాచారం. తన 8 మంది అనుచరులకు టికెట్లు ఇవ్వకపోతే తాను ఎన్నికలలో పోటీ చేయబోనని కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు తన అనుచరులకు కూడా టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఏవో కారణాలతో ఇవ్వలేమని చెప్పడం సరికాదని రేవంత్‌రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్థానాలపై రేపు సాయంత్రంలోగా కాంగ్రెస్‌ పార్టీ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

రేవంత్‌రెడ్డి అనుచరులు వారు కోరుకొంటున్న స్థానాల వివరాలు: 

1. నరేందర్ రెడ్డి: వరంగల్ వెస్ట్

2. బోడ జనార్దన్: చెన్నూరు

3. సుభాష్ రెడ్డి: ఎల్లారెడ్డి 

4.  పటేల్ రమేష్ రెడ్డి: సూర్యాపేట

5. అరికెల నర్సారెడ్డి: నిజామాబాద్ రూరల్

6. హరిప్రియ: ఇల్లందు

7. బిల్యా నాయక్: దేవరకొండ 

8. రాజారామ్ యాదవ్: ఆర్మూరు