.jpg)
మహాకూటమిలో పార్టీలు ఇంకా సీట్ల పంపకాలపై సిగపట్లు పడుతూనే ఉన్నాయి. తెరాస 107 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించినందున ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈనెల 12-19వరకు నామినేషన్లు వేయడానికి గడువు ఉంది. ఒకరోజు ముందుగా అంటే ఈనెల 11వ తేదీ నుంచి తెరాస అభ్యర్ధులకు బి-ఫారంలు పంపిణీ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. కనుక అభ్యర్ధులు ముహూర్తాలు చూసుకొని గడువులోగా తాపీగా నామినేషన్లు వేసుకోగలుగుతారు. అయితే 8వ తేదీ నుంచి కార్తీకమాసం మొదలవుతుంది కనుక మొదటి సోమవారంనాడు అంటే నవంబరు 12వ తేదీన ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మహాకూటమి ఈనెల 9వతేదీలోగా తన అభ్యర్ధులను ప్రకటిస్తే వారిని బట్టి తెరాసలో మిగిలిన 12 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాలని సిఎం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. కనుక 9వ తేదీ తరువాత తెరాస కూడా మిగిలిన 12 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించవచ్చు.