1.jpg)
మహాకూటమిలో సీట్ల పంచాయితీ ముగిసిందని తాజా సమాచారం. ఈరోజు హైదరాబాద్లో సమావేశమైన మహాకూటమి నేతలు సీట్ల సర్దుబాట్లపై మరోసారి చర్చించి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహాకూటమిలో కాంగ్రెస్-95, టిడిపి-14, తెలంగాణ జనసమితి-6, సిపిఐకి 4 స్థానాలలో పోటీ చేయడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అలాగే నాలుగు పార్టీలు పోటీ చేయబోతున్న స్థానాలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం టిడిపి: ఖమ్మం, సత్తుపల్లి, అశ్వరావుపేట, మక్తల్, దేవరకద్ర, కోదాడ లేదా సికింద్రాబాద్, నిజామాబాద్ రూరల్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, పటాన్ చెరువు, రాజేంద్రనగర్, మలక్ పేట్, ఛార్మినార్ స్థానాల నుంచి పోటీ చేయబోతోంది.
తెలంగాణ జనసమితి: సిద్దిపేట, రామగుండం, అంబర్ పేట్ లేదా ముషీరాబాద్, చెన్నూరు, ఓల్డ్ సిటీ(1), ఓల్డ్ సిటీ(2) నియోజకవర్గాలలో నుంచి పోటీ చేయబోతోంది.
సిపిఐ: బెల్లంపల్లి, దేవరకొండ, కొత్తగూడెం, మునుగోడు లేదా హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్: మిగిలిన 95 స్థానాలలో పోటీ చేస్తుందని సమాచారం. అయితే దీనిపై మహాకూటమి నేతలు ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.కనుక ఈ సమాచారంలో నిజానిజాలు మహాకూటమి నేతల ప్రకటన తరువాతే తెలుస్తాయి.